బాలికల గురుకులంలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

ఫోటో రైట్ అప్: సాంస్కృతి క కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులు చొప్పదండి, ఆగస్ట్ 22 (జనం సాక్షి), చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాలలో స్వాగతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు .ఈ మేరకు గురుకులంలో నూతనంగా 5వ తరగతిలో, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంప్రదాయ బద్ధంగా ఆటపాటలతో భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. ఈ సందర్భంగా గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎల్ స్వాతి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణిస్తేనే ఉజ్జల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకొని ఉపాధ్యాయుల సూచనల మేరకు విద్యను కొనసాగిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ సంబోధి శేఖర్, ప్రధాన కార్యదర్శి సానాది వెంకటేష్, కోశాధికారి బి శంకర్, ఉపాధ్యక్షులు బి విజయ, ఎల్ అజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి లిఖిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ సంపత్ ,సభ్యులు సదానందం ,లచ్చయ్య, శ్రీనివాస్ ,సుధాకర్ ,సంపత్, శంకర్ రెడ్డి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.