బాలికావిద్యపై ప్రచారం చేయాలి: స్మృతి ఇరానీ

ph5న్యూఢిల్లీ,మార్చి9 :  మహిళా శాస్త్రవేత్తలంతా బాలికల చదువు, దాని ప్రాముఖ్యంపై ప్రచారం చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. మహిళా చదువుతోనే సమాజ పురోగమనం సాధ్యమన్నారు. మహిళా చదవుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు.  ‘ఉమన్‌ ఇన్నొవేటర్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ రీసెర్చ్‌ అండ్‌ సైన్స్‌ విన్నర్స్‌’ అనే అంశంపై దిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. డీఆర్‌డీఓ మహిళా శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ‘ఉన్నత్‌ భారత్‌ అభియాన్‌’ పథకం కింద గ్రావిూణ ప్రాంతాల్లోని బాలికలంతా చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. సాంకేతికతను చేరువ చేసి వారి కలల్ని నెరవేర్చుకునేందుకు తోడ్పాటునందించాలని చెప్పారు. దీంతోమహిళల అభివృద్దికి సానుకూలత ఏర్పడుతుందన్నారు.