బాలుడిపై దూసుకెళ్లిన కారు..చిన్నారి మృతి

హైదరాబాద్: మన్సురాబాద్ లోని శ్రీనివాస కాలనీలో విషాదం నెలకొంది. బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లడంతో అతను త్రీవంగా గాయపడి.. మృతి చెందాడు. మన్సురాబాద్ లోని శ్రీనివాస కాలనీలో సూర్య అనే రెండున్నరేళ్ల బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి భూషణం మద్యం మత్తులో కారునడపడంతో.. కారు బాలుడిపైకి దూసుకెళ్లింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు, కుంటుబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి భూషణాన్ని స్థానికులు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే భూషణానికి రెండేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.