బాల వికాస సేవలు మరువలేనివి: సర్పంచ్
జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్25:
బాలవికాస సేవలు మరువలేనివని సుందరగిరి గ్రామ సర్పంచ్ శ్రీముర్తి రమేష్ అన్నారు.మండలంలోని సుందరగిరి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆదివారం బాలవికాస సంస్థ అధ్వర్యంలో విజయలక్ష్మి హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా స్థానిక సర్పంచ్ శ్రీముర్తి రమేష్ మాట్లాడుతూ వరంగల్ కి చెందిన బల్తెరిశా అధ్వర్యంలో లో బలవికాస సంస్థ ఏర్పాటయిందని బాలవికాస సంస్థ కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించిందని వితంతువులకు ఆర్థిక సహాయం అందించడం వారికి వివిధ కోర్సులో శిక్షణ నైపుణ్యాలు ఇప్పించడంతోపాటు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, వాటర్ సెడ్ల నిర్మాణం ,ఇంకుడు గుంతల నిర్మాణము, బస్ షెల్టర్ లో ఏటీమ్ వాటర్ సెంటర్ల ఏర్పాటు చేయడంతో పాటు వెనుక బడిన గ్రామాలలో చేతి పంపుల ఏర్పాటు చేసి తన సామాజిక దృక్పథాన్ని చాటుకుంటోంది అన్నారు.సుందరగిరి గ్రామంలో కూడా పేదవారికి ఆరోగ్య సమస్యలు వున్నవారికి వారికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరమని అంతే కాకుండా గతంలో కూడా సుందరగిరి గ్రామంలో చేతిపంపుల ఏర్పాటు కరోనా సమయం సమయంలో హ్యాండ్ వాష్ మిషన్స్ వంటి వాటిని విద్యార్థిని విద్యార్థులకు అందించడం జరిగిందని అదే స్ఫూర్తితో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించడం మా గ్రామం వారికి రుణపడి ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసి మెడబోయిన తిరుపతి, ఉప సర్పంచ్ జంగ శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్, డాక్టర్ ఎల్ విజయలక్ష్మి, వార్డు సభ్యులు కంది శంకర్, బొల్లి సుమలత బాలవికాస ప్రతినిధులు జ్యోతి,నిర్మల తదితరులు పాల్గొన్నా