బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు.

తాండూరు(ఆదిలాబాద్ జిల్లా): బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం లింగధరిగూడెంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కెపల్లి ప్రీతమ్, సురేష్ బావాబామ్మర్ధులు. కుటుంబకలహాలతో ప్రీతమ్‌ను బావ సురేష్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.