బాసరలో వసంతపంచమి ఉత్సవాలు ప్రారంభం
భారీగా ఏర్పాట్లుచేసిన ఆలయ అధికారులు
అక్షరాభ్యాసాలకు ప్రత్యేక ఏర్పాట్లు
నిర్మల్,ఫిబ్రవరి8(జనంసాక్షి): బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గణపతి ¬మం, చండియాగంతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. వేదోక్తంగా వేకువజామునే పూజలు నిర్వహించారు.
ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, బాసర సర్పంచ్ లక్ష్మణ్‌రావు, ఆలయ ప్రత్యేకాధికారి సుధాకర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వసంతపంచమి సందర్బంగా అక్షరాభ్యాసాలకు చిన్నారులతో తల్లిదండ్డుఉల తరలివస్తారు. దీంతో వరుసగా రెండు రోజులు సెలువులు కూడా రావడంతో ఆలయ అధికారులు ఏర్పాటుచేశారు. మూడురోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. వసంత పంచమి ఏర్పాట్లతో బాసర క్షేత్రం ప్రత్యేక శోభను సంతరించుకుంది. సరస్వతి అమ్మవారి పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారి కోసం సకల సౌకర్యాలు కల్పించింది. వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈసారి శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు బాసర క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు జరుగనునన్నాయి. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు, సరస్వతి మాతను దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి చూడకుండా ప్రత్యేక క్యూ లైన్లను అందుబాటులో ఉంచారు. డార్మెటరీలు, మెడికల్ క్యాంపులు, ఇతర సదుపాయాలను కల్పించారు. వసంత పంచమి రోజు శనివారం తెల్లవారుజామున రెండున్నర నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అభిషేకం, లోక కల్యాణ యాగంతో పాటు ఇతర క్రతువులు వేదోక్తంగా నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు వేకువజాము నుంచే అవకాశం కల్పిస్తారు. రెండ్రోజుల పాటు వసంత పంచమి వేడుకలు జరుగనున్న నేపథ్యంలో భక్తులు బాసర క్షేత్రానికి పోటెత్తనున్నారు. అమ్మవారి సేవలో తరించనున్నారు. ఇదిలా ఉంటే బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గణపతి ¬మం, చండియాగంతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.