బిఎస్పి ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

టేకులపల్లి ,ఆగస్టు 12( జనం సాక్షి) : పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ బీఎస్పీ ఆధ్వర్యంలో టేకులపల్లి మండల‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ బి ఎస్ పి అధ్యక్షులు బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవం, ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా బీఎస్పీ ఆధ్వర్యంలో పోటీపరీక్షల అవగాహన సదస్సు ఈనెల 14వ తారీఖున ఇల్లందులోని పెన్షనర్స్ భవనంలో జరుగుతుందన్నారు. ఇల్లందు నియోజక వర్గం లోని చదువుకున్న వాళ్లు, నిరుద్యోగులు, ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, ఉద్యోగాలు లేక యువకులు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. పేదరికము పోవాలంటే బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక చక్కటి అవకాశమన్నారు.బడుగు బలహీన వర్గాలు అత్యున్నతస్థాయిలో ఉద్యోగాలు సంపాదించి పేద ప్రజలకు మార్గదర్శకులు అవ్వాలని కోరారు. బహుజన సమాజ్ పార్టీ చదువుకి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. బహుజన రాజ్యంలో ప్రజలు సంతోషముతో అత్యుత్తమ ప్రమాణాలతో జీవితం గడుపుతారు అని అన్నారు. నియోజకవర్గంలోని యువతీ ,యువకులు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని , ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లేతకుల కాంతారావు, మండల నాయకులు పూనెం రామస్వామి, ధరావత్ లోకేష్, బాదావత్ తులసమ్మ, రాజు, నరేష్, సోను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.