బిక్షమయ్య గురూజీ ఆధ్వర్యంలో సత్యసాయి ధ్యాన మండలి
రుద్రంగి సెప్టెంబర్ 10 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ లో పూజ్య శ్రీ బిక్షమయ్య గురూజీ ఆధ్వర్యంలో అంతర్మిక యోగ శిక్షణ,అద్వైత మంత్రం,చిత్తశుద్ధి యోగ శిక్షణ,సోహం దాన్యం,సత్య దర్శన యోగా శిక్షణ,ఆత్మశుద్ధియోగం,సంకల్ప సిద్ది యోగ శిక్షణ, పూర్ణమంతం,ఆత్మస్థితి యోగా శిక్షణ పరిపూర్ణ యోగా మంత్రం పై సత్యసాయి ధ్యాన మండలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమిరె శంకర్, అల్లూరి,రాజీ రెడ్డి, డిసిసి కార్యదర్శి చెలకల తిరుపతి, గ్రామ శాఖ దయ్యాల కమలాకర్,తదితరులు హాజరై గురువు శిక్షణలో ధ్యానం యోగం నిర్వహించారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి గట్ల మీనయ్య, చెలకల తిరుపతి మాట్లాడుతూ…. ఆనందమనేది మానవుల సహజ స్థితి అది అంతరంగంలోనే ఉంటుందని బాహ్య ప్రపంచం నుండి లభించేది కానేకాదని అన్నారు.అంతరంగ మందలి ఆనందాన్ని విస్మరించి అంతరిక్ష ప్రయోగాలలో నిమగ్నం కావడమే అజ్ఞానం ధ్యానం యోగాల సమ్మేళనంతో ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించచ్చని అదే మానవ జీవిత పరమార్ధం అన్నారు.పరిమి తత్వం నుండి బయటపడి స్విచ్ ఆఫ్ అనుభవించే వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మికవేత్త అవుతాడని అదే మన సాంప్రదాయమని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.