బిచ్కుందలో ప్రాచీన నాణాల ప్రదర్శన

బిచ్కుంద జులై 08 (జనంసాక్షి) డిగ్రీ కళాశాలలో ప్రాచీన నాణాల ప్రదర్శన నిర్వహించారని ఆ కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ చంద్రముఖర్జి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం అధ్యాపకులు డా టీ శ్రీనివాస్ అధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు రచ్చ శివకాంత్ తో కలిసి ప్రాచీన నాణాల ప్రదర్శన క్రీస్తుపూర్వం నుండి 2020 వరకు ప్రాచీనం, మధ్యయుగం, ఆధునికయుగ నాణాలు , పేపర్ కరెన్సీ నోట్లు సైతం పప్రదర్శించారు. ఈ నాణాలు ప్రపంచంలోని 255 దేశాల నాణాలు ప్రదర్శించారు. అపోలో రెండవ రాజు, ఇండోగ్రీకులు, శాతవాహనులు, గుప్తుల, మౌర్యులు, విజయనగర రాజులు, కాకతీయులు, కుతుబ్ షాహిలు, ఢిల్లీ సుల్తానులు, మొగలులు, పాలిమర్ నోట్లు ప్రదర్శించారు. అలాగే తపాల సేకరణను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.