బిచ్కుందలో ఫ్రైడే మరియు డ్రై డే
బిచ్కుంద జులై 08 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఫ్రైడే అండ్ డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ఆరోగ్య భోధకుడు దస్థిరాం మాట్లాడుతూ ప్రతి ఫ్రైడే ని డ్రై డే నిర్వహించుకోవాలని సూచించారు. దోమ లార్వా పొదగడానికి పెట్టె కాలము వారం రోజులు కావున వారం తిరక్కముందే నిల్వ ఉన్న నిటీని పారేయాలని, దోమ పుట్టకుండ దోమకుట్ట కుండా చూసుకోవాలని, దోమలు 3 రోగాలు 5 అనాఫిలిస్దోమ వల్ల మలేరియా,కువేలెక్స్ దోమవల్ల బొధకాలు (ఫైలేరియా) జేఈ, ఏడేస్ దోమవల్ల డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాతవి కులర్లు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, కారము నూరే రోళ్ల ఇంకా ఏవైనా దోమ నిల్వనిటీని వెంటనే తొలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, దుర్గామని, ఫ్లారెన్సు, శాంతా అంగన్వాడి టీచర్, ఆశా కార్యకర్తలు సునీత, సవిత తదితరులు పాల్గొన్నారు.