బిజెపిలోకి చంపై సోరెన్ రాక
కమలం గూటికి లాగేయత్నంలో హిమంత్ బిశ్వశర్మ
న్యూఢల్లీి,ఆగస్ట్27 (జనం సాక్షి): జార్ఖండ్ మాజీ సీఎం, జేఎఎం నేత చంపాయి సోరెన్ బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు సంకేతాలు అందాయి. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు. దేశంలోని ఓ విశిష్టమైన ఆదివాసీ నేత చంపాయి సోరెన్ అని ఆయన కొనియాడారు. జైలు నుంచి హేమంగ్ సోరెన్ రిలీజైన తర్వాత.. 67 ఏళ్ల చంపాయి సోరెన్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే త్వరలోనే కొత్త రాజకీయ జర్నీ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. తన వద్ద మరింత సమయం ఉంటే, రాష్టాన్న్రి మరింత డెవలప్ చేసేవాడినని చంపాయి పేర్కొన్నారు.1990లో జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోమం చేపట్టిన ఆయన్ను.. జార్ఖండ్ టైగర్‌గా పిలుస్తారు. ఈ ఏడాది చివరలో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ రాష్టాన్రికి బీజేపీ ఇంచార్జీగా ఉన్న హిమంత బిశ్వ శర్మ .. చంపాయి సోరెన్‌ను కమలం పార్టీలోకి లాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అమిత్ షాను చంపాయి కలిశారు. శుక్రవారం రాంచీలో జరిగే కార్యక్రమంలో చంపాయి సోరెన్ బీజేపీలో చేరనున్నారు.