బిజెపి బలమైన శక్తిగా వస్తోంది
కెసిఆర్ మాటలను ఇక ప్రజలు నమ్మరు
హావిూలను విస్మరించిన టిఆర్‌ఎస్‌కు గుణపాఠం
బిజెపి అధికార ప్రతినిధి రఘునందనర్ రావు
సిద్దిపేట,అక్టోబర్2 జనం సాక్షి : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి బలమైన కూటమిగా రానుందని, ఒంటరి పోరుతోనే ముందుకు వెళతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి,దుబ్బాక రఘునందన్ రావు అన్నారు. బీజేపీ అనే ఓ పార్టీ ఏడున్నదో ఎవరికీ తెలియదంటూ గతంలోసీఎం కేసీఆర్ మాట్లాడటంతో ఆయనకు దుబ్బాకలో కూడా ఉందని రుజువు చేశామని, ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ ఉందని రుజువు చేయబోతున్నామని
అన్నారు. హుస్నాబాద్ సభకు వెళ్లేముందు ఆయన కొందరు విూడియా మిత్రులతో మాట్లాడారు. బిజెపి ఎక్కడుందని కెటిఆర్ లాంటి వారు అనడం వారి అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. బీజేపీ ఎక్కడా లేకపోతే ఢల్లీికి పోయి బీజేపీ నాయకులకు పొర్లుదండాలు ఎందుకు పెడుతున్నావని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 50 గదుల విశాలమైన ప్రగతి భవన్‌లో ఉండే ఆయనకు పేదల బాధ ఏం తెలుస్తుందని విమర్శించారు. ప్రజలు సైతం తెరాస పాలనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కెసిఆర్ నిరంకుశ ధోరణితోనే
భాజపా వైపు యువత ఎక్కువ మొగ్గుచూపుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాజకీయ అవినీతిని నిర్మూలిస్తామని పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలను దూరం పెడతామని అన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలనే మోడీ ముక్త కాంగ్రెస్ నినాదంతో కటుఉంబ లేదా వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడారని అన్నారు. తెలంగాణలో కూడా కెసిఆర్ కుటుంబ పాలనను ప్రజలు తిప్పకొట్టడం ఖాయమని అన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటించడంతో పార్టీ నూతనోత్సా హంతో ముందుకెళ్తోందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హావిూలను అమలు చేయకుండా విపక్షాలపై నిందలు మోపిన కెసిఆర్‌ను ఓడిరచడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పాలించడం చేతకాక విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. మాటతప్పిన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలని, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఏడేళ్లలో ఏం చేశారో చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఇన్నాళ్లూ ప్రజలను మాటలతో మభ్యపెట్టిన ఏకైక ప్రభుత్వం ఇదేనన్నారు. బిజెపిని విమర్శిస్తే ఓట్లు పడే కాలం పోయిందన్నారు. ప్రజలు ఎవరేంటన్నది బాగా తెలుసుకున్నారని అన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హావిూని నెరవేర్చకుండా ప్రజలను దగా చేసిన ఘనత కెసిఆర్‌దని అన్నారు. మళ్లీ గెలిపిస్తే ప్రగతి భవన్ నీడను కూడా సోకనీయరని గుర్తుంచుకోవాలని అన్నారు. టిఆర్‌ఎస్‌ను గద్దె దింపేందుకు బిజెపి శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.