బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల రాజశేఖర్.
నెరడిగొండఅక్టోబర్ 9(జనంసాక్షి):
భారతీయ జనతా పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా కుప్టీ గ్రామానికి చెందిన ఆకుల రాజశేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు సోసయ్య హీరాసింగ్ ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ సింగ్ తెలిపారు.గతంలో సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న సాబ్లే సంతోష్ సింగ్ మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడంతో ఆ పోస్టు ఖాళీగా మారిందని ఆకుల రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ తన మీద నమ్మకంతో సాధారణ కార్యకర్త అయిన నన్ను సోషల్ మీడియా కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించడం ద్వారా మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని వచ్చే ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు.