బిడ్డను చంపిన కసాయి తండ్రి
మెదక్ జిల్లాల్లో కన్నతండ్రే ఓ చిన్నారి పట్ల కసాయిగా మారాడు. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న కోపంతో చిన్నారని కొట్టి చంపాడు. పటాన్‌చెరు గౌతమ్‌నగర్‌లో ఉండే ధన్‌రాజ్‌కు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. దీంతో చిన్న అమ్మాయిని చిత్రహింసలు పెట్టాడు. భర్త టార్చర్ తట్టుకోలేక తను కూతురుని తీసుకు ధన్‌రాజ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వచ్చింది. అయినా తీరుమారని ధన్‌రాజ్ చిన్నారిని తీవ్రంగా కొట్టడంతో చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడి అరెస్ట్ చేశారు.