బిసిల అభివృద్ధి కీ కేంద్ర ప్రభుత్వం చేయూత భాజాపా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్
నిర్మల్ బ్యూరో, జూన్11,జనంసాక్షి,, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాల పరిపాలనపై శనివారం రాష్ట్రవ్యాప్తంగా బిసి సదస్సులను నిర్వహించాలని పార్టీ పిలుపు మేరకు పట్టణంలోని తారకరామనగర్ లోగల బీసీ భవన్లో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పొన్నం నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమనికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ హాజరై ప్రసంగిస్తూ బిజెపి దేశంలో బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పథకాలను అనేక రకాలుగా అందించడం జరుగుతున్నది..అన్నారు. దేశ ప్రధాని గా బిసి అయిన నరేంద్ర మోడీ ని నియమించి బీసీల్లో ఉన్న ప్రాధాన్యతను గుర్తించి పెంచడం జరిగింది అదే విధంగా దేశంలో బిసి కమిషన్ను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి వారికి ఎటువంటి అన్యాయం జరిగినా సమస్యలొచ్చినా బిసి కమీషన్ ద్వారా పరిష్కారానికి కృషి చేయడం జరుగుతున్నది దాంతోపాటు ప్రతి అభివృద్ధి పథకంలో బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారికి ఆదుకోవడం జరుగుతున్నది అన్నారు అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం మరో బిసి నాయకుడైన డాక్టర్ లక్ష్మణ్ను రాజ్యసభకు పంపడం మరో బిసి సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయను గవర్నరుగా నియమించడం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎటువంటిదో అర్థమవుతుందని అన్నారు బీసీల అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం అందుకే రాష్ట్రంలో కేంద్రంలో బీసీలు బిజెపికి అండగా ఉండాలని రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ లను తేవడంలో బీసీలు సహకరించాలని కోరారు. ఈ సదస్సులో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోట సత్యనారాయణ నాయకులు ఒడ్నాల రాజు కూన విజయ్ నారాయణ గోవిందు రాజు హన్మంతు తదితరులు పాల్గొన్నారు