బిసి గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యం*
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి బ్యూరో అక్టోబర్ 17 (జనం సాక్షి) పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బిసి గురుకుల పాఠశాలను సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను,అభివృద్ధి పనులను చేపడుతుందన్నారు. వనపర్తి జిల్లాలో అన్ని సౌకర్యాలతో వివిధ విద్యాసంస్థల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా 600పడకల ఆసుపత్రి ఏర్పాటు, 600 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం, రూ. 120 కోట్ల రూపాయలతో మొదటి దశ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు కాకుండా రాష్ట్రంలో 5వ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ వనపర్తి లో ఏర్పాటయిందని, నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో తొలి మత్స్య కళాశాల ఏర్పాటు చేశామని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఫార్మసి కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. అంతేకాకుండా వ్యవసాయ కళాశాల, భవిష్యత్తులో పశువైద్య కళాశాల ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు.విద్య సమాజానికి ఎంత అందుబాటులో ఉంటే అంత అభివృద్ధి చెందుతుందని అది ఉచితంగా ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటే ప్రజల మీద భారం తగ్గుతుందని వారన్నారు.ఎనమిదిఏళ్లలో రాష్ట్రంలో అత్యధిక గురుకుల పాఠశాలల ఏర్పాటు, పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, వెల్టూరు గురుకుల పాఠశాలను అన్ని రకాల వసతులతో ఆకర్షణీయంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు గతంలోని వెల్టూరు లో రూ 1.80 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు పని చేసుకుని బతికే వారికి తెలంగాణ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంచిందన్నారు.అదేవిధంగా వీరయ్యపల్లి గ్రామంలో వేర్ హౌసింగ్ సంస్థ నిర్మించిన నూతన గోదాములను మంత్రి ప్రారంభించారు.గురుకుల పాఠశాల ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ రాములు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు,జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area