బిసి సమీకృత భవనం కొరకు నిధులు కేటాయించడం అభినందనీయం.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు.
 వెంటనే స్థలం కేటాయించి పనులు ప్రారంభించాలి.
జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు నవంబర్ 27(జనంసాక్షి(గత కొన్ని సంవత్సరాలు నుండి బీసీ సంఘం డిమాండ్ చేస్తున్న బీసీ సమీకృత భవనం స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు కొరకు కృషిచేసినందుకు తాండూర్  నియోజక వర్గం బీసీ సంఘం తరఫున జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్కుమార్ కందుకూరి కృతజ్ఞతలు తెలిపారు.గత మూడు సంవత్సరాల క్రితం రాజ్ కుమార్ నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో పాటు కుల సంఘాల పెద్దలు బీసీ యువజన నాయకులతో బీసీ సమీకృత భవనం కొరకు స్థానిక ఎమ్మెల్యే ని కలిసి తాండూర్ లో పూర్తి అంగులతో బీసీ సమీకృత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సానుకూలంగా స్పందించి జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ తో పాటు ఇతర ముఖ్య నాయకులతో కలిసి రెండు చోట్ల స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు రెండు కోట్ల బిసి సమీకృత భవనం కొరకు ప్రత్యేక నిధులు తీసుకురావడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే భూమిని కేటాయించి పనులను కూడా ప్రారంభించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు