బీఆరఎస్‌కు గతమే..భవిష్యత్ లేదు
` కాళేశ్వరంపై చర్యలు తప్పవు
` సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
` కవిత ప్రశలకు కేసీఆర్ సమాధాన చెప్పాలి
` ఈ విషయంమై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?
` వాళ్లది పంపకాల పంచాయతీ
` కేసీఆర్ పార్టీకే మనుగడ లేదు కొత్త పార్టీ సంగతి తర్వాత..
` ఉద్యమం అప్పుడు ఎలా మాట్లాడినా సహించారు
` పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదు
` కొన్ని సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పింది
` మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):బీఆరఎస్ పార్టీకి గతం ఉంది తప్ప, భవిష్యత్ లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు వారు ఎలా మాట్లాడినా సహించారన్న ఆయన, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, బీఆరఎస్ పార్టీకి ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేవని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబమంతా ఒక్కటేనని, రంగు, రుచి లేదని వ్యాఖ్యానించారు. వారు నటిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అని, ఆయన చావును తానేందుకు కోరుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ మర మనిషో కాదో కుటుంబ సభ్యులకే తెలియాలన్నారు. వివక్ష లేని పాలన కాంగ్రెస్‌దని, తమకు ప్రతిపక్షమే లేదన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కవిత చెబుతున్నట్లు కేసీఆర్ ఎవరి బందీలో ఉన్నారని, కేసీఆర్ మర మనిషా మనసున్న మనిషా అని కవితకు జవాబివ్వాలన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారా? అని ప్రశ్నించారు. బీఆరఎస్ ఎక్స్‌పైరీ గడువు తీరిందని ఇక ఆ పార్టీతో పనిలేదని విమర్శించారు. బీఆరఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానమని, కేసీఆర్ తన శత్రువు కాదని కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అన్నారు. కేసీఆర్‌కు చెడు జరగాలని కోరుకుంటోంది ఆయన కుటుంబమేనని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, కొన్ని సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందని అన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు వద్దని కోర్టు చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ తర్వాతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. సీబీఐ వివరాలు కోరితే అన్నీ ఇస్తామని, విచారణ మొదలైతే అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. సీబీఐ విచారణ కోరితే కేంద్రం 48 గంటల్లో లోపల వేస్తామన్నారని సీఎం గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరినా కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? అని, విచారణ కోసం కేంద్రం వద్దకు వెళ్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉందని తోసిపుచ్చారు.పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అసెంబ్లీ ప్రాంగణం భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై అంతకుముందు శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్?లో సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ సవిÖక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. సభ గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, మెంబర్స్?కు మరింత ప్రైవసీ ఉండాలన్నారు. పబ్లిక్ గార్డెన్?లో మెంబర్స్ కోసం క్లబ్ ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతంలో సభ్యుల కోసం వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. వచ్చే సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం కావాలన్నారు. హెరిటేజ్ భవనాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
చాకెట్లలాగా డ్రగ్స్ దొరుకుతున్నాయి
అప్రమత్తం కాకపోతే భవిష్యత్ అంధకారం
మహిళలకు రక్షణ కల్పించాలంటే మత్తు పదార్థాలపై దష్టి పెట్టాలి
` దేశ అభివద్ధిలో మహిళా భాగస్వామ్యం
` వారికి భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత
` తెలంగాణలో బస్సులకు మహిళలను యజమానులను చేశాం
` అదానీ, అంబానీలతో తెలంగాణ ఆడబిడ్డలు పోటీపడుతున్నారు
` మహిళలు, చిన్నారుల భద్రతకు హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
` మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో స్పందన బందాలను ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి):సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలంటే మత్తు పదార్థాలపై దష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు స్పందన కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీసుల ఏర్పాటు చేశారు. హాజరైన హాజరైన సీఎం రేవంత్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో స్పందన బందాలను ప్రారంభించారు. ఎంత సంపాదించినా పిల్లలు సరైన దారిలో లేకపోతే ఉపయోగం లేదని ఆయన తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల్లో మత్తు పదార్ధాల ప్రభావం ఉంటుందన్న సీఎం రేవంత్ డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మనం ఎంత సంపాదించినా పిల్లలు సరైన దారిలో లేకపోతే ఉపయోగం లేదని సీఎం పేర్కొన్నారు. డ్రగ్స్ మహమ్మారితో పంజాబ్ రాస్టం నాశనం అయిందని ప్రస్తావించారు. తెలంగాణలో స్కూల్స్ సవిÖపంలోని దుకాణాల్లో గంజాయి చాకలేట్లు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. వాటిపై ఉక్కుపాదం మొపేందుకు ఆపరేషన్ సేఫ్ స్కూల్ ప్రారంభించిన చామని వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల్లో మత్తు పదార్ధాల ప్రభావం ఉంటుందన్నారు. డ్రగ్స్ నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. గతంలో మత కలహాలు ఉన్నప్పుడు పీస్ కమిటీలు బాగా పనిచేసాయన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేనందున డ్రగ్స్ నిర్ములనలో వారిని భగస్వాములు కావలన్నారు. డ్రగ్స్ నిర్ములనలో ఎంతటి వారినైనా వదలమని ఉద్ఘాటించారు. ఇటీవల కొందరు ప్రజా ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని వెల్లడించారు. పోలీసులకు పూర్తి ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నిర్ములనలో రాజకీయ నేతలైనా, సెలబ్రిటీలైనా ఎవ్వరిని వదలే ప్రసక్తేలేదన్నారు.ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 ఏళ్లు పట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల ఓటు హక్కు కోసం అమెరికాలోనే చాలా సమయం పట్టిందని చెప్పారు. స్వాతంత్య్రం రాగానే పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించారని గుర్తుచేశారు. దేశ అభివద్ధిలో మహిళలను భాగస్వాములను చేశారని తెలిపారు. మహిళల ఆధ్వర్యంలో పాలనను కాంగ్రెస్ ప్రోత్సహించిందని చెప్పుకొచ్చారు. చట్టాలు, శాసనాలు చేయడానికి మహిళలకు సంపూర్ణ అవకాశం ఇచ్చిందని ప్రస్తావించారు. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చాయని అన్నారు. గ్రావిÖణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు వచ్చాయని తెలిపారు. మహిళలకు అవకాశం ద్వారా పాలనలో భాగస్వామ్యం లభించిందన్నారు. అసెంబ్లీ, లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్ల కోసం 2013లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిందని ప్రస్తావించారు. ఇప్పటికీ మహిళల పట్ల సమాజంలో కొంత వివక్ష ఉందన్నారు. మహిళలకు రక్షణ, పిల్లలకు భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని స్పష్టంచేశారు. ‘స్టాండ్ విత్ హర’ కార్యక్రమం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని వెల్లడించారు. డయల్ 100, 112 ద్వారా స్పందన బందాలు 24 గంటలపాటు సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. సమస్య వచ్చాక పరిష్కారం కాకుండా సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సరైన సమయంలో స్పందిస్తే మహిళలు వివక్ష ఎదుర్కొనే పరిస్థితి రాదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట మంజూరు చేశామని గుర్తుచేశారు. సంక్షేమ పథకం మహిళకు అందిస్తే కుటుంబ గౌరవాన్ని కాపాడుతుందన్నారు. మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు సారె పేరుతో చీరలు అందిస్తున్నామని ప్రస్తావించారు. మహాలక్క్ష్మి పథకం కింద ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా వెయ్యి బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు హావిÖ ఇచ్చారు. బస్సులను ఆర్టీసీకి లీజుకు ఇచ్చి మహిళలను బస్సులకు యజమానులను చేస్తున్నామని వెల్లడించారు. సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే మొదట వచ్చేది అదానీ, అంబానీ పేర్లు వినిపిస్తాయని సీఎం పేర్కొన్నారు. వారితో తెలంగాణ ఆడబిడ్డలు పోటీపడేలా చేస్తున్నామని అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే శక్తి మహిళలకు అందిస్తున్నాం అని తెలిపారు.
కాళేశ్వరంపై వెంటనే విచారణ చేపట్టాలని సీబీఐపై ఒత్తిడి తేవాలి
ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష
సీబీఐకి లేఖ రాయాలని అధికారులకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సవిÖక్ష నిర్వహించారు. కాళేశ్వరంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చి ఒత్తిడి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సూచించారు.సీబీఐ విచారణకు ఇస్తే 48 గంటల్లో తేల్చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదే పదే అంటూ వచ్చారని, తాము అసెంబ్లీలో చర్చించి సీబీఐకి ఇస్తే ఇప్పటి వరకు ఉలుకూ పలుకూ లేదని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో సీబీఐ విచారణ చేపట్టినా తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు. తమను సంప్రదిస్తే అవసరమైన సమాచారం అందిస్తామని స్పష్టం చేశారు. సరైన రీతిలో స్పందించకపోతే.. అటు పార్టీ పరంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇటు ప్రభుత్వం తరఫున తాను కార్యాచరణ రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు.



