బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మాజీ బిజెపి కౌన్సిలర్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి, ఆగస్టు 4 ::
సంగారెడ్డి పట్టణ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీరామ్ వెంకట్ బిజెపి నుంచి బీఆర్ఎస్ లో చేరారు.
సంగారెడ్డి పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆయనను అహ్వానించిన చింతా ప్రభాకర్.
శ్రీరామ్ వెంకట్ తో పాటు 50 బిజెపి పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ
పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే పార్టీలోకి చేరుతున్నారని చెప్పారు .
పార్టీలో చేరిన వారికి పార్టీ కార్యక్రమంలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.
కేసీఆర్ అభివృద్ధి పితామహుడని, తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక పాలకుడని పేర్కొన్నారు.
ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు.
పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ
బిజెపి పార్టీలో సరైన గుర్తింపు లేదని , అందుకే బీఆర్ఎస్ లో చేయడం జరిగింది అన్నారు.
సంగారెడ్డిలో పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు.
నిరంతరం పార్టీ కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే చింతా ప్రభాకర్ నాయకత్వంలో పని చేస్తాం .
చింతా ప్రభాకర్ నాయకత్వంలో సంగారెడ్డి లో బీఆర్ఎస్ జండా ఎగరవేయడానికి కృషి చేస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు,కౌన్సిలర్ విష్ణు, శ్రావణ్ రెడ్డి, జలెందర్ నూతన పార్టీలో చేరిన కార్యకర్తలు ఉన్నారు.