బీజింగ్‌లో భారీ వర్షం

బీజింగ్‌: చైనా రాజదాని బీజింగ్‌లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు 10 మంది చనిపోయినట్టు చైనా టెలివిజన్‌ సీఎస్‌టీవి పేర్కొంది. గత ఆరు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా 212మి.మీ వర్షపాతం నమోదయిందని చైనా వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షం కారణంగా నగరంలో దాదాపు లక్షమందిని సురక్షితప్రాంతాలకు తరలించారు.