బీజేపీ ఓడిపోని పార్టీ కాదు : ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము&కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు ఇది గుణపాఠమని అన్నారు. గట్టిగా పోరాడితే మోడీ, బీజేపీలు ఓడిపోని వారేమీ కాదని తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ ప్రతిష్టంభన మీద స్పందిస్తూ..పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.