బీజేపీ గెలుపుతోనే తెలంగాణ సాధ్యం
మెదక్ : ప్రత్యేక రాష్ట్రంపై తెలంగాణ ప్రజల కోరిక తీరాలంటే భారతీయ జనతాపార్టీ గెలుపుతోనే సాధమౌతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీథర్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం పరిపాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను గద్దె దించి ప్రజలను బాధల నుంచి కాపాడాలని మురళీథర్ రావు అన్నారు.