బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ఎంజీ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక  30వ వార్డ్ కౌన్సిలర్ పల్సా మహాలక్ష్మి గౌడ్  మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వస్తే తెలంగాణకు మాత్రం నిజాం పాలన నుండి విముక్తి కలిగి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన ఆపరేషన్ పోలో ద్వారానే తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని చెప్పారు.ఉద్యమ కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఇచ్చిన హామీని మరిచారన్నారు.భవిష్యత్ తరాలకు తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం తెలిసేలా
పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు.పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఏడాది పాటు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఈ నెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొననున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సలిగంటి సరిత , గార్లపాటి మమతారెడ్డి ,  మీర్ పర్వీన్, మణెమ్మ , కవిత తదితరులు పాల్గొన్నారు.
Attachments area