బీడీఎల్ ఉద్యోగి ఇంట్లో చోరి
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్ మండలం అల్మాస్‌గూడలోని ఓ బీడీఎల్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరి జరిగింది. దుండగులు 40 తులాల బంగారం , కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.