బీడీ, సిగరెట్ పరిశ్రమలను ఒక్కటిగా చూడొద్దు

1mpd4z3gబీడీ కట్టలపై హెల్త్ వార్నింగ్ లోగో సైజు పెంచుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై.. టీయారెస్ ఎంపీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడిన ఆమె.. హెల్త్ వార్నింగ్ లోగో పెంపువల్ల దేశంలోని బీడీ కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం.. బీడీ, సిగరెట్ పరిశ్రమలను ఒక్కటిగా చూడొద్దన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులంతా నిరుపేదలని చెప్పారు. తెలంగాణలో వేల మంది కార్మికులు బీడీలు చుట్టి జీవిస్తున్నారన్న కవిత.. హెల్త్ వార్నింగ్ లోగో పెంపు విషయంలో బీడీ పరిశ్రమకు మినహాయింపునివ్వాలని కోరారు.