బీమా రంగంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు

e8y6kcgyన్యూఢిల్లీ జ‌నంసాక్షి
పార్లమెంటులో ఆర్థిక రంగానికి సంబంధించి కీలక బీమా, మైనింగ్, బొగ్గు కేటాయింపుల బిల్లుల ఆమోదం పట్ల ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశ బీమా రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీమా రంగంలోకి పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లుసహా కీలక బిల్లుల ఆమోదం సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ అధికారాలకు ప్రభుత్వం కత్తెర పెడుతోందన్న వార్తలను జైట్లీ కొట్టి పారేశారు. ప్రభుత్వ బాండ్ల ట్రేడింగ్ పై నియంత్రణాధికారాలను ఆర్బీఐ నుంచి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి బదలాయించనున్నట్లు జైట్లీ తెలిపారు.