బీసీసీఐతో రాజీ యత్నాలు ప్రారంభించిన కపిల్‌దేవ్
-మోరే బాటలోనే భారత మాజీ కెప్టెన్
ముంబై: ఇండియన్ క్రికెట్ లీగ్‌లో చేరి బీసీసీఐ నుంచి నిషేదానికి గురైన భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఇప్పుడు రాజీపడేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా మాజీ వికెట్ కీపర్ కిరణ్‌కుమారే క్షమాపణ పత్రాన్ని ఆమోదించడంతో కపిల్‌దేవ్ కూడా అదే బాటలో నడవాలని భావిస్తున్నాడు. ఇటీవల ఐసిఎల్‌కు రాజీనామా చేసినట్టు ఈ మాజీ భారత సారథి స్వయంగా ప్రకటించాడు. రాజీనామా లేఖను కూడా మీడియాకు చూపించాడు. అప్పటి నుంచే బోర్డుతో రాజీ పడేందుకు అతను ప్రయత్నిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే కపిల్‌దేవ్ రాజీ వెనుక బీసీసీఐ ప్రెస్‌డింట్ శ్రీనివాసన్ పాత్ర ఉందని తెలుస్తోంది. అయన సలహాతోనే కపిల్ దీనికి ఒఒప్పుకున్నట్లు బోర్డు వర్గాల సమాచారం. త్వరలోనే కపిల్‌దేవ్ క్షమాపణ లేఖను బీసీసీఐకి రాయనున్నట్లు తెలుస్తోంది. 2007లో బీసీసీఐకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో కపిల్‌దేవ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు భారత దేశవాళీ క్రికెటర్లు కూడా దీనిలో చేరడంతో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఐసిఎల్‌లో చేరిన ఆటగాళ్ళపై బోర్డు నిషేదం వేసింది. తర్వాత 2008లో ఐపీఎల్ ప్రారంభమవడంతో క్రమంగా ఐపిఎల్ కనుమరుగైంది. అయినప్పటికీ బోర్డుతో మాత్రం కపిల్‌దేవ్‌కు సరైన సంబంధాలు లేవు. ఇటీవల ఐపిఎల్ ఐదో సీజన్ సందర్భంగా మాజీ క్రికెటర్లను గౌరవిస్తూ లీగ్‌లో వచ్చి లాభాలను వారికి పంచింది. దీనిలో కపిల్‌దేవ్ పేరు లేకపోవడంతో విమర్శలు కూడా వచ్చినప్పటికీ.. బీసీసీఐ మాత్రం పట్టించుకోలేదు. తాజాగా ఐపిఎల్‌లో చేరిన కిరణ్‌మోరే బోర్డుకు క్షమాపణలు చెబుతూ రాసిన లేఖను బీసీసీఐ సర్కింగ్ కమిటీ ఆమోదించింది. వెంటనే వన్‌టైమ్ బెనిఫిట్ లాభాలకు కూడా అతన్ని అర్హుడ్ని చేయడంతో కపిల్‌దేవ్ కూడా ఇప్పుడు అదే బాటలో వెళుతున్నారు. వన్‌టైమ్ బెనిఫిట్ నిబంధనల ప్రకారం కపిల్‌దేవ్‌కు బోర్డు క్షమాభిక్షపెడితే దాదాపు కోటిరూపాయలు అందుతాయి. అలాగే గతంలో అతనికి నిలిపివేసిన పలు బకాయిలను సైతం బీసీసీఐ క్లియర్ చేయనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.