బీసీ భవన్ లో అత్యవసర సమావేశం.
పాల్గోన్న తాండూరు బీసీ సంఘం కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి.
తాండూరు అగస్థు 7(జనంసాక్షి)జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణా బిసి సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు లాల్ కృష్ణ అధ్యక్షతనఅసెంబ్లీ- పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, జనగణన లో కుల గణన చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆగస్ట్ 9న చలో ఢిల్లీ” ఉద్యమ కార్యక్రమం చేపట్టినట్లు జాతీయ బిసి సంక్షేమా సంఘం అద్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. బీసీ నాయకులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సాకు చెందిన ముఖ్య బిసి నాయకులు సమావేశం ఆదివారం హైదరాబాదులోని బీసీ భవన్ లో అత్యవసర సమావేశం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణా బిసి సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు బాబ్ కృష్ణ అధ్యక్షతన ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి మంత్రుల ఇళ్ళ ముట్టడి, ప్రతిపక్షాలను కలిసి ప్రభుత్వం పై వత్తిడి పెంచడం లాంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు. అదేవిధంగా సుప్రీం కోర్టులో ఉన్న “కుల గణన” కేసును వేగవంతం చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు.ఈ కార్యక్రమానికి తాండూరు బీసీ సంఘం కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి అనంతయ్య, వేముల రామకృష్ణ, ఉదయ్, చంటి, తరుణ్ యాదవ్ ఆదివారం వివిధ రైళ్ళలో వందలాది మంది ఢిల్లీ కి బయలుదేరారు.