*బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, స్కాలర్ షిప్స్ అందజేయాలి.
నల్గొండ టౌన్.జనం సాక్షి
బీసీ స్టడీ సర్కిల్ లో కోచింగ్ తీసుకుంటున్న ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు పూర్తి స్కాలర్ షిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ, బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిణి పుష్పలత వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కార్యదర్శి కట్టెకోలు దీపెందర్, నిరుద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పాల్వాయి రవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత బీసీ విద్యార్థులు నల్గొండకు విచ్చేసి బీసీ పేద విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో పరీక్ష రాసి బిసి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటున్న సందర్భంలో గత రెండు నెలలుగా బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో విద్యార్థులు హాజరుశాతం కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. బయోమెట్రిక్ పనిచేయని పక్షంలో రిజిస్టర్ ద్వారా హాజరు తీసుకోవాల్సిన డైరెక్టర్ అలా చేయకుండా 60 శాతం హాజరు ఉంటేనే స్టడీ మెటీరియల్, స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి విద్యార్థులను వేధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాల పంపిణీ చేసి అలాగే 90 రోజుల కోర్సుకు నెలకు ఐదు వేల రూపాయలు అనగా ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు స్కాలర్ షిప్ అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ప్రతి విషయంలో వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే బిసి స్టడీ సర్కిల్ లో సరైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, నిరుద్యోగ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు గొబ్బిళ్ళ అనిల్ కుమార్, జిల్లా కన్వీనర్ పాలడుగు నరేష్, బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, పలువురు బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులు మానస, లక్ష్మీ, దేవిక, ప్రకాష్, నాగరాజు, శివ, రామ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area