బీసీ స్మశాన వాటిక అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి.

జాతీయ కార్యవర్గ సభ్యుడు తాండూర్ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు నవంబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పోలీస్ స్టేషన్ వెనుకల ఉన్న బిసి స్మశాన వాటిక పాత తాండూర్ బోనమ్మ గుడి వద్ద ఉన్న బీసీ స్మశాన వాటిక గొల్ల చెరువులో ఉన్న స్మశాన వాటికను వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి అంగులతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి ఆధ్వర్యంలో వందలాదిమంది బిసి యువకులతో కుల సంఘాల పెద్దలతో బిసి మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీతో మున్సిపల్ కార్యాలయం కు చేరుకుని నిరసన ప్రదర్శనతో మున్సిపల్ కార్యాలయం ముందు బైటాయించి  బిసి స్మశాన వాటికలను వెంటనే అభివృద్ధి చేయాలని పిచ్చి మొక్కలను తొలగించాలని నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ యావత్ భారతదేశం మొత్తం కరోనా తర్వాత వైకుంఠధామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచారని కానీ తాండూర్ లో ఉన్న బీసీ స్మశాన వాటికలు అభివృద్ధికి నోచుక పోవడం చాలా బాధాకరమని అన్నారు. బిసి స్మశానవాటిక కోసం నిధులు ఉన్న టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే బీసీ స్మశాన వాటికల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్థానిక పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న స్మశానవాటికల్లో కుక్కలు పందులు రాజమేలుతున్నాయని పోలీస్ స్టేషన్ వెనకాలనే మూత్ర విస్తరణ చేయడం వల్ల ఆ ప్రాంతమంతా చెత్తాచెదరంతో నిండిపోయిందని స్థానిక పోలీసులు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా బీసీ మహిళ అధ్యక్షురాలు మధులత శ్రీనివాస చారి రాష్ట్ర కార్దర్శి సయ్యద్ సుకుర్ నాయి బ్రాహ్మణ సమాజ అధ్యక్షులు పరమేష్ ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షులు శ్రీకాంత్ బోయ వాల్మీకి సమాజ నాయకులు బద్రు బిజెపి తాండూర్ కన్వీనర్ రజనీకాంత్ కౌన్సిలర్ బాలప్ప రజక సంఘం యువ నాయకులు పరమేష్ మాట్లాడుతూ బీసీ స్మశాన వాటికని వెంటనే అన్ని అంగులతో అభివృద్ధి పరచాలని లేదంటే బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర సమాజం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నాయి బ్రాహ్మణ సమాజం నాయకులు బలరాం, హనుమంతు, శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం యువ నాయకులు రాము, టైలర్ రమేష్, శ్రీనివాస్, కిరణ్ బిసి యువ నాయకులు బోయ రాధాకృష్ణ తాండ్ర నరేష్ జుట్టుపల్లి వెంకట్ అమ్రేష్ ఇందూర్ వెంకట్ గడ్డం వెంకటేష్ రోహిత్ రాజ్ టీ స్టాల్ రాము బిసి నియోజవర్గ అధ్యక్షురాలు నాయి కోడి జ్యోతి ఉపాధ్యక్షురాలు అనిత కార్యదర్శులు విజయలక్ష్మి మంజుల యలాల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ చారి బషీరాబాద్ మండలాధ్యక్షుడు నరేందర్ లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్  బిసి యువ నాయకులు బస్సు మాధవ్ మతిన్ భాస్కర్ సాయి నరసింహ అనిల్ దుబాయ్ వెంకట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు