బీహార్‌లో గెలుపు మాదే
హైదరాబాద్ నవంబర్ 5 (జనంసాక్షి):
బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్రమోదీ, ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇద్దరూ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ఫలితాలు సంచలనం రేపుతాయన్నారు. మహాకూటమి మొత్తం 190 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. భాజపా కూటమి 40 స్థానాలకే పరిమితం అవుతుందన్నారు.