బీహార్ సీఎం నితీషే
– బెంగాల్ సీఎం మమత బెనర్జీ జోస్యం
పాట్న అక్టోబర్ 25 (జనంసాక్షి):
బిహార్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్‌ను మరోసారి ఎన్నుకోవాలని పశ్చిమ్‌బంగా సీఎం మమతాబెనర్జీ బిహార్ ప్రజలను కోరారు. నితీశ్‌లాంటి వ్యక్తి దేశానికి ఎంతో అవసరమని, రాష్ట్ర అభివృద్ధి ఆయన వల్లే జరుగుతుందన్నారు. బిహార్‌లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రెండు దశల పోలింగ్ పూర్తవగా.. మిగిలిన మూడు దశల పోలింగ్ అక్టోబర్ 28, నవంబర్ 1, 5 తేదీల్లో జరగనుంది. నవంబరు 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.