బురదమయంగా మారిన గౌండ్లపల్లి రోడ్డు

పట్టించుకోని గ్రామ పంచాయతీ పాలకులు అధికారులు
నాట్లు వేసే నిరసన తెలిపిన ప్రజలు
మల్హర్,జనంసాక్షి
తేలిక పాటి వర్షానికే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారిన దుస్థితి మండల కేంద్రమైన తాడిచర్ల లోని 13 వ వార్డులోని గౌండ్లపల్లి లో నెలకొంది. దీంతో ఆ వార్డు ప్రజలు బురద మయంగా మారిన రోడ్డు పై శుక్రవారం నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. చిన్న వానకే రోడ్డు చిత్తడిగా మారి ఈగలు దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక సార్లు పంచాయతీ అధికారులకు, పాలకులకు తమ గోడు వినిపించిన పట్ఠించుకనే నాథుడే కరువయ్యాడని బురద రోడ్డు పొ నడవడానికి నరక యాతన పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు పల్లె ప్రగతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించిన తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామీణ అంతర్గత రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందిని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి 13 వ వార్డులోని గౌండ్లపల్లి లో సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.