బూరుగడ్డ శాల్మలీ కంద శ్రీ ఆదివరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ బాధ్యతలు స్వీకరించిన గోవిందరెడ్డి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి): మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న చారిత్రక దేవాలయం శ్రీ ఆది వరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా గుమ్మెత గోవింద్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ హైదరాబాద్ వారి ఉత్తర్యుల ప్రకారం ఆలయ ఈఓ ఎంపీ లక్ష్మణ్ రావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. ఇదే దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన కె. కొండారెడ్డి మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయానికి బదిలీ కాగా.. మట్టపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో పనిచేసిన గోవిందరెడ్డి బూరుగడ్డ ఆలయానికి బదిలీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్త కళావతి, అర్చకులు ముండుబై హరీష్ కుమారాచార్యులు, మనోహరాచార్యులు, ఆలయ సిబ్బంది యరగాని కిరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.