బెంగాల్లో వక్ఫ్‌ చట్టం అమలుచేయం

` నిరసనల నేపథ్యంలో స్పష్టం చేసిన సీఎం మమత
కోల్‌కతా(జనంసాక్షి):వక్ఫ్‌ సవరణ చట్టం పశ్చిమ బెంగాల్‌లో అమలు కాదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం విస్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రంలో హింసాత్మక నిరసనల నడుమ మమత ఈ ప్రకటన చేశారు. ఆ చట్టాన్ని కేంద్రం చేసిందని, సమాధానాలను కేంద్రం నుంచే కోరాలని మమత అన్నారు. ’అన్ని మతాల ప్రజలకు నా మనవి, దయచేసి ప్రశాంతంగా ఉండండి, సంయమనంతో వ్యవహరించండి. మతం పేరిట ఎటువంటి మత వ్యతిరేక చర్యలకూ దిగకండి. ప్రతి మానవ ప్రాణం విలువైనదిÑ రాజకీయాల కోసం అల్లర్లను ప్రేరేపించకండి. అల్లర్లను ప్రేరేపించేవారు సమాజానికి హాని చేస్తున్నారని మమత ’ఎక్స్‌’ పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్త చట్టంపై శుక్రవారం నిరసనలు వెల్లువెత్తినప్పుడు మాల్డా, ముర్షిదాబాద్‌, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో దౌర్జన్య సంఘటనలు ప్రజ్వరిల్లగా పోలీసు వ్యాన్లతో సహా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు, భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు, రోడ్లపై అవరోధాలు ఏర్పాటు- చేశారు. అనేక మందిని ఆగ్రహానికి గురి చేసిన ఆ చట్టాన్ని మేము చేయలేదని గుర్తు ఉంచుకోండి. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. కనుక విూకు కావలసిన సమాధానానికి కేంద్ర ప్రభుత్వాన్నే అడగండి’ అని సిఎం అన్నారు. ’ఈ విషయమై మా వైఖరిని మేము స్పష్టం చేశారు. మేము ఆ చట్టాన్ని సమర్థించడం లేదు. మన రాష్ట్రంలో ఆ చట్టం అమలు జరగదు. మరి అల్లర్లు దేని గురించి’ అని ఆమె అన్నారు. అల్లర్లను ప్రేరేపించేవారిపై చట్టపరమైన చర్య తీసుకోనున్నట్లు మమత స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం మతాన్ని దుర్వినియోగం చేయజూస్తున్నారు. వారి మాటలకు లొంగకండని ఆమె అన్నారు. వక్ఫ్‌ చట్టం బెంగాల్‌లో అమలు చేయబోమని పునరుద్ఘాటించారు. నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి.. రోడ్లను దిగ్బంధించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మమత ఎక్స్‌ వేదికగా స్పందించారు. కాగా శుక్రవారం నుంచి కొనసాగుతోన్న నిరసనలపై భాజపా విమర్శలు గుప్పించింది. ఆందోళనలను అదుపులోకి తీసుకురావడానికి అవసరమయితే కేంద్ర సహాయం తీసుకోవాలని సూచించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని.. సమాజంలోని ఇతర వర్గాలలో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి కొన్ని అవాంఛనీయ శక్తులు చేస్తున్న ప్రయత్నాలని మండిపడిరది.

బెంగాల్‌లో ఆందోళనలు హింసాత్మకం
` నిరసనల్లో ముగ్గురు మృతి
` కేంద్ర బలగాలను మోహరించండి
` హైకోర్టు ఆదేశం
కోల్‌కతా(జనంసాక్షి):వక్ఫ్‌ (సవరణ) చట్టానికి (%ఔaనట Aష్‌%) వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మాల్డా, ముర్షిదాబాద్‌, సౌత్‌ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి.. రోడ్లను దిగ్బంధించారు. ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీసిన కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడిరచారు. ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. కాల్పుల్లో మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. వక్ఫ్‌ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శనివారం బెంగాల్‌లోని మాల్డా, ముర్షిదాబాద్‌, సౌత్‌ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వారిని ఆపి.. పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో హింసాత్మక వాతావారణం నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా జంగీపుర్‌లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర పరిస్థితిపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ.. వక్ఫ్‌ చట్టాన్ని అమలు చేయబోమని ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. అలాంటప్పుడు ఈ ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడవద్దని కోరారు. మరోవైపు, త్రిపురలోని ఉనకోటిలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన ర్యాలీ నిర్వహించారు. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.
కేంద్ర బలగాలను మోహరించండి
వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో కోల్‌ కతా హైకోర్టు స్పందించింది. నిరసన ర్యాలీలను అదుపులోకి తేవడంతో పాటు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రధానంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జంగీపూర్‌ లో కేంద్ర బలగాలను దింపాలని ఆదేశాల్లో పేర్కొంది.