బెల్ట్‌షాపులపై మహిళల దాడి

మెదక్‌ : దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాపులపై శుక్రవారం ఉదయం మహిళల ముకుమ్మడిగా దాడి చేశారు. మద్యం సీసాలను పగలకొట్టారు. మద్యం అమ్మవద్దు అంటూ బెల్ట్‌షాపుల వద్ద మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.