బెస్ట్ అవైలబుల్ స్కూల్ 22 మంది గిరిజన విద్యార్థుల ఎంపిక వికారాబాద్ జిల్లా బ్యూరో జనంసాక్షి జూన్ 6
గిరిజన విద్యార్థిని , విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించుటకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద 22 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ తెలిపారు. 3వ,5వ,8వ తరగతులలో అడ్మిషన్ కొరకు 54 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా ఇన్చార్జి డిఆర్ఓ విజయ కుమారి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ పద్దతిలో 22 మందిని ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 3వ తరగతి లో 4మంది బాలికలు, 7మంది బాలురు, 5వ తరగతి లో బాలికలు ఇద్దరు, 4మంది
బాలురు, 8వ తరగతి లో బాలికలు ఇద్దరు , ముగ్గురు బాలుర్లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఎంపిక చేయబడ్డ విద్యార్థులకు ఉచిత రెసిడెన్షయల్ ద్వారా విద్యను అందించడం జరుగుతుందని అన్నారు.