బైకు అదుపు తప్పి ప్రమాదంలో వ్యక్తి మృతి..
చేవెళ్ల ఆగస్టు 21 (జనంసాక్షి) బైకు అదుపు తప్పి ముందువెళ్తున్న వహణంను ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఆలూరు గ్రామానికి చెందిన నరేష్(29) పదవ తరగతి వరకు చదువుకొని వ్యవసాయ చేస్తున్నాడు. నరేష్ ఆదివారంనాడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆలూరు స్టేజ్ వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా బైకు అదుపు తప్పి ముందు వెళ్తున్న వహణంను ఢీ కొని పడి పోయాడు. బలమైన గేయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని చేవెళ్ల హాస్పటల్లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.