బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరుమృతి

p2a81v8dనల్గొండ : చిలుకూరు మండలం సీతారాంపురం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఉదుర్ నగర్ నుంచి కోదాడకు బైక్ పై వెళ్తున్న వారిని కోదాడ నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.