బైక్ పై దూసుకెళ్లిన లారీ, వ్యక్తి మృతి

మెదక్,( ఏప్రిల్ 3) : నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం బైక్ పైకి లారీ దూసుకెళ్లడంతో   వ్యక్తి మృతి చెందాడు. నారాయణఖేడ్ బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.  రాములు అనే వ్యక్తి బైక్ నెం. ఏపీ 23 ఏఎం 7557 పై బైపాస్ రోడ్ లో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ నెం. ఏపీ 6ఎక్స్ 7277 అతనిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాములు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు.