బొలెరో వాహనంలో వచ్చి చోరీకి యత్నం
-ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు
వెల్దుర్తి (మెదకఖ) : పట్టణంలోని లక్ష్మీపతి కిరాణా దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో వచ్చి దొంగతనానికి ప్రయత్నించిచారు. అయితే స్థానికులు వారిని అడ్డుకుని వెంబడించడంతో దుండగులు వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. దుండగలు పారిపోతూ డీవీరాజు అనే వ్యక్తికి చెందిన ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులకు బాధితులు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.