బోధనభ్యసన సామాగ్రితో తరగతి గదిలో విద్యార్థులకు ఆకర్షణీయ పద్ధతుల్లో ఉపాధ్యాయులు బోధన చేపట్టాలి

 రాష్ట్ర విద్యాశాఖ అదనపు డైరెక్టర్ వెంకటనరసమ్మ
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబర్17 జనంసాక్షి:
ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠ్యాంశానికి తగిన బోదనభ్యసన సామాగ్రి పరిసరాల్లో దొరికే వస్తువులతో సమకూర్చుకొని పాఠ్యప్రణాళిక ఆధారంగా బోధనలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ అదనపు డైరెక్టర్ వెంకట నరసమ్మ అన్నారు.
గురువారం నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మండలాల్లో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయుల ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ….
 ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు టి ఎల్ యంను ఎప్పుడూ నిత్య నూతనంగా ఆకర్షణగా తక్కువ ఖర్చుతో కూడిన, పరిసరాల నుండి ఎక్కువ సామాగ్రి సమకూర్చుకొని ఉపయోగించాలన్నారు.
 తయారీ లో విద్యార్థులు సహకారం తీసుకోవాలన్నారు.
తరగతి గదిలో బోధన మరియు అభ్యసన పక్రియలు రెండూ పలప్రదం కావడానికి  బోదనభ్యసన సామాగ్రి తప్పక వినియోగించాలన్నారు.
పిల్లలు బడి పట్ల ఆశక్తి కలిగించి ఆకర్షితులనూ చేస్తుందన్నారు.
విద్యార్థులు ఆసక్తిగా, ఉత్సాహంతో బోధన పక్రియలో పాల్గొంటారని ఆమె తెలిపారు.
అవసరమనుకుంటే ఇంట్లో తమ పిల్లలపై ప్రయోగించి పరిశీలించుకోవాలని ఉపాధ్యాయులను కోరారు.
విద్యార్థులు సహజ వాతావరణంలో నేర్చుకొనుటకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
బహుళ తరగతుల బోధన సులభతరం చేయుట,గణితం వంటి క్లిష్టమైన భావనలు విద్యార్థులు సులభంగా అవగాహన చేసుకొనుటకు బోదనభ్యసన సామాగ్రి దోహదపడుతుందని తెలిపారు.
నాగర్ కర్నూల్  లో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ప్రదర్శించిన బోధన అభ్యసన సామాగ్రిని ఆమె పరిశీలించి ఉపాధ్యాయులను అభినందించారు.
జిల్లాలో తొలిమెట్టును విజయవంతంగా నిర్వహిస్తూ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను పకడ్బందీగా అమలు చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులను ఆమె అభినందించారు.
ఆమె వెంట సెక్టోరల్ అధికారి సతీష్ కుమార్, మండల విద్యాధికారి బాసు నాయక్, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర శెట్టి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.