బోనకల్లు మండలం లో దళిత బంధు పథకం వర్తింపజేయాలి…

కుల నిర్మూలనే కెవిపిఎస్ లక్ష్యం..

బోనకల్, అక్టోబర్ 02( జనం సాక్షి):
సమాజంలో కుల వివక్షతను నిర్మూలించడమే కేవీపీఎస్ లక్ష్యంమని కేవిపిఎస్ మండల కార్యదర్శి గార్లపాటి రమేష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన బోనకల్లో కెవిపిఎస్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మండలం లో ఉన్న దళితులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని ఆయన కోరారు మండలంలో ఉన్న దళిత కుటుంబాలు ఆర్థిక స్తోమత లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని దళిత బంధు పథకాన్ని వర్తింపజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దళితులపై చిన్న చూపు చూస్తూ అనేక దౌర్జన్యముగా , దాడులు చేస్తూ పలు రకంగా హింసిస్తూ వివక్షతకు గురి అవుతున్నరని ఆయన అన్నారు ఎటువంటి వివక్షత లేకుండా మనుషులంతా సమానమనే భావంతో ప్రతి ఒక్కరు మెలగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్షులు మంద సత్యానందం ,నాయకులు ఏసు పోగు బాబు, ఇరుగు రమేష్ ,బంక శీను, కర్లకుంట నరేష్ తదితరులు పాల్గొన్నారు.