బోనమెత్తిన కేరళ మోడల్ స్కూల్ విద్యార్థులు

వేములవాడ, జూలై 15 (జనంసాక్షి)
వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ, సాయినగర్ కు చెందిన కేరళ మోడల్ స్కూల్ విద్యార్థులు శనివారం రోజున భక్తి శ్రద్దలతో శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు. డప్పుసప్పుల్ల మధ్య పోతరాజుల నృత్యాలతో ఘనంగా బోనాల వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సతి- మనోజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బోనాల పండుగను ఆషాడ మాసంలో గ్రామంలో, పట్టణాలలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. తెలంగాణ సాంస్కృతి కట్టు, బొట్టు బోనం ఆచారాలపై విద్యార్థులకు తెలియజేశారు. పాడి, పంటలు చక్కగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామదేవతలకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. విద్యార్థినీలు పట్టు వస్త్రాలతో నెత్తిన బోనం ఎత్తి, విద్యార్థులు పోతరాజు వేషధారణలో డప్పుసప్పుల్ల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు దివ్య శ్రీ, శ్రీలత, శ్రీవాణి, ప్రత్యుష, అర్చన,శ్రావణి, లావణ్య, శ్రీనివాస్, మధు, విశాల్ కుమార్, అభిరామ్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు