బోయిన్ పల్లి పోలీసులను చేదించి బాటసింగారం వెళ్లిన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 20 తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్,సనత్ నగర్ నియోజకవర్గం సీనియర్ బీజేపీ నేత చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ పోలీసుల నిర్భందం నుంచి ఛేదించుకుని బాటసింగారం బాట పట్టారు.బాటసింగారం లో నిర్మాణం పూర్తి కాని డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు.ఈ పిలుపు మేరకు గురువారం నాడు ఉదయం కార్పొరేటర్ చీర సుచిత్ర, సీనియర్ నేత చీర సత్యనారాయణ (శ్రీకాంత్) బాటసింగారం వెళ్లడానికి బోయిన్ పల్లి లో భావన కాలనీ గల వారి నివాసం నుంచి బయలు దేరడానికి సిద్దమైనారు. అంతకు ముందే తెల్లవారు జామున బోయిన్ పల్లి పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నాం,మీరు ఎక్కడికి వెళ్ళకూడదని హుకూం జారి చేశారు.ఆ హుకూంను కాతరు చేయకుండా కార్పొరేటర్, సీనియర్ నేత మాకు పనులు చాలా ఉండడంతో మేము వెళ్లక తప్పదు అని చెప్పి భారీ వర్షం కురుస్తున్న తన డ్రైవర్ ను పిలుపించుకుని కారులో బాటసింగారం వెళ్ళారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాచక పాలన త్వరలో అంతంకానున్నదని, బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లడం తప్పేంటని, హౌస్ అరెస్టులతో మా పోరాటం ఆపలేరని అన్నారు.సీఎం కేసీఆర్ చేసిన మోసాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని,వాటిని వెలుగులోకి తేవడానికి మొదటి సారిగా మా నేత ఇచ్చిన పిలుపు మేరకు బాటసింగారం వెళుతున్నామని సుచిత్ర తెలియజేశారు.రాంగోపాల్ పేట్ డివిజన్ లో నాలాలు ను పరివేక్షించిన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్గత రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతోఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాంగోపాల్ పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ మరియు నాయకులు జాతీయ విపత్తు నివారణ సంస్థ సిబ్బంది తో కలిసిబస్తీలులో నాళాలు ఉన్న ప్రాంతాలు జలమయం కాకుండా పర్యవేక్షించారు .

తాజావార్తలు