బోరుబండి బోల్తా: నలుగురికి గాయాలు

నల్గొండ,జూలై28(జ‌నం సాక్షి): కనగల్‌ మండలం పులిమామిడి ,బాబాసాహెబ్‌ గూడెం మద్య బోరు బండి బోల్తా పడింది .డ్రైవర్‌ ఓవర్‌ స్పీడ్‌ గా వెళ్లడం వలన ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 4 గురికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను నల్లగొండ శ్రీలక్ష్మి ఆస్పత్రికి తరలించారు . బోరు బండి ముప్పారం నుండి నల్లగొండకు వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగింది . డ్రైవర్‌ పరారీలో ఉన్నట్టు ఎస్సై తెలిపారు . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బతి నర్సింహులు తెలిపారు.