బోరు బావిలో చిన్నారి

1

– కాపాడేందుకు ముమ్మర యత్నాలు

మెదక్‌,నవంబర్‌28(జనంసాక్షి):

మెదక్‌ జిల్లా పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో శనివారం ఉదయం మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం…. తండాకు చెందిన కుమ్మరి రాములు అనే రైతు శనివారం  తెల్లవారుజామున బోరు వేయగా నీళ్లు రాక విఫలమైంది. దీంతో బోరు బావిపై మూత వేయకుండా అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. సాయిలు ఇంటికి వంద విూటర్ల దూరంలో బోరు బావి ఉంది. శనివారం ఉదయం సాయిలు కుమారుడు రాకేశ్‌(3) ఇంటి సవిూపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయాడు. తమ కొడుకు బోరుబావిలో పడిపోవటం కళ్లారా చూశామని తల్లిదండ్రులు మొగులమ్మ, సాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. బోరుబావిలో పడిన బాలుడ్ని రక్షించేందుకు, పోలీసులు, రెవెన్యూ, 108 సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 108 సిబ్బంది ట్యూబు సాయంతో బోరు బావిలోకి ఆక్సిజన్‌ పంపుతున్నారు. జీసీబీ, రెండు పొ/-లకెయిన్‌లతో బోరుబావి సమాంతరంగా మరో గొయ్యి తవ్వుతున్నారు. పుల్కల్‌ ఎస్‌.ఐ సత్యనారాయణ, సర్పంచి శోభ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇంటి ముందు తాగునీటి కోసం ఈ బోరుబావి తవ్వారు. బాలుడిని బయటకు తీసేందుకు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూటీమ్‌, పోలీసులు బోరుబావిలోకి ఆక్సిజన్‌ పంపుతున్నారు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.