బోర్డు తిప్పేసిన రిషబ్‌ చిట్‌ఫండ్స్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): చిట్టీల పేరుతో భారీ మోసానికి తెగబడ్డారు. రూ. 200 కోట్లు వసూలు చేసి రిషబ్‌ చిట్‌ఫండ్స్‌ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చిట్‌ఫడ్స్‌ కంపెనీ ద్వారా 600 మంది నిండా మునిగారు. బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, చిట్‌ఫండ్స్‌ యజమాని శైలేష్‌ గుజ్జర్‌ కోసం గాలిస్తున్నారు. వసూలు చేసిన డబ్బులతో గోవాలో క్యాసినోలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పబ్‌ అండ్‌ బార్లలో పెట్టుబడులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.