బోల్తాపడ్డ పశువుల లారీ: 20 ఆవుల మృతి

మెదక్‌,జూన్‌21(జ‌నం సాక్షి): టేక్మల్‌ మండలం బోడ్‌మట్‌పల్లిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20ఆవులు మృతి చెందాయి. ఆవుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆవుల మృతితో తాను తీవ్రంగా నష్టపోయానని వాటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.