బౌలింగ్ పెద్ద సమస్య..? గౌతం గంభీర్
కొలొంబొ : జూలై 30 : శ్రీలంకతో జరిగిన మూడవవన్డేలో టీమిండియా గెలవడానికి కారణం ఖచ్చితంగా ఓపెనర్ గౌత మ్ గంభీర్ చేసిన సెంచరీ అనడంలో ఎటువంటి సందేహం లేదు.శనివారం ప్రేమదాసు స్టేడియం లో జరిగిన మూడోవన్డేలో గౌతమ్‌గంభీర్ 96 బంతుల్లో (10ఫోర్లు) సెంచరీ చేసి ..ఆ తర్వాత లేని పరుగు ప్రయత్నించి 106 పరుగుల వద్ద ర నౌటయ్యాడు. శ్రీలంకపై మ్యాచ్ గెలిచిన అనంత రం గౌతమ్‌గంభీర్ మాట్లాడుతూ… చివరిపది ఓవర్లు టీమిండియా సరిగా బౌలింగ్ చేయలేద ని, చివరి పది ఓవర్లను గనుక గమనించినట్లైతే మేము 60నుండి 70పరుగుల లోపే నియంత్రిం చాల్సి ఉనప్పటికి అనవసరంగా 95పరుగులు ఇచ్చం అన్నారు.శ్రీలంక బ్యాట్స్‌మేన్‌లు ఏంజిలో మ్యాథ్యూస్, జీవన్‌మెండిస్ ఇద్దరూ టీమిండియా బౌలర్స్‌పై విరుచుకుపడి చివరి పది ఓవర్లలో ఎ క్కువ పరుగులు సాధించారు. టీమిండియా గెల వడానికి ముఖ్యకారణం టీమిండియా టాప్ త్రీ బ్యాట్‌మెన్స్ రాణించడామెనని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఈరోజు నారోజు బ్యాట్‌తో బంతిని అన్ని వైపులకు కొడుతూ పరుగులు సాధించాం. ఇక రోహిత్‌శర్మ డక్‌అవుట్ రూపంలో పెవిలియ న్‌కు చేరడంపై ఒక్కోసారి అలా జరగుతూ ఉం టుందని అన్నాడు. ఇండియాలో ఉన్న యంగ్ టాలెంట్‌బ్యాట్‌మెన్‌లలో రోహిత్‌శర్మఒక్కడంటూ కితాబు ఇచ్చాడు.ఇక సురేష్‌రైనా సాధించిన 65 పరుగులు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాయనిఅన్నాడు.చివరి వరకు ఉత్కటంగా సాగిన ఈమ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోవడం కెప్టెన్ మహెళాజయవర్దనేకు నిరాశకల్గించిందనే చెప్పా లి. టాస్ గెలిచిన శ్రీలంక 50 ఓవర్లలో 5 వికేట్ల నష్టానికి 286పరుగుల స్కోరుచేసింది.
బదులు గా 287పరుగుల భారీస్కోరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం ఛేదించింది. 5వన్డే మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.